Saturday, May 5, 2012

బీస్ సాల్ బాద్ నుంచి కహి దీప్ జల్

http://www.youtube.com/watch?v=9igDD2G9nbk

 http://www.raaga.com/play/?id=13287

ఎక్కడో ఒక మంట రగులుతుంది
మరెక్కడో ఒక హృదయం

ఓసారి వచ్చి చూసిపోవా సఖా!
ఎక్కడికీ నీ పయనం?
ఎక్కడో ఒక మంట రగులుతుంది
మరెక్కడో ఒక హృదయం
నా గుండె పిలిచిన పిలుపే నా ఈ పాట
నేనెక్కడున్నా నీవేనాప్రాణానివి
నా ఎదే నీ సందడి
ఓసారి వచ్చి చూసిపోవా సఖా!
ఎక్కడికీ నీ పయనం?
ఎక్కడో ఒక మంట రగులుతుంది
మరెక్కడో ఒక హృదయం


స్వప్నాన్ని కాను,రహస్యాన్నీ కాను
బాధాతప్త స్వరాన్ని
ఆలస్యమెందుకు ప్రియా వచ్చి చేరవా నన్ను
ఓసారి వచ్చి చూసిపోవా సఖా!
ఎక్కడికీ నీ పయనం?
ఎక్కడో ఒక మంట రగులుతుంది
మరెక్కడో ఒక హృదయం

శతృమూక చుట్టూ ఉందని తెలిసాక
నాచూపుతోనే నన్ను పోల్చు ప్రియా
వేయిముఖాలతో మరణం ఇక్కడ ఉంది
ఓసారి వచ్చి చూసిపోవా సఖా!
ఎక్కడికీ నీ పయనం?
ఎక్కడో ఒక మంట రగులుతుంది
మరెక్కడో ఒక హృదయం
పెద్దలారా,మితృలారా ఈ స్వప్నాన్ని కాదు నేను బాధాతప్త స్వరాన్ని
ఒక సినిమా పాటకు స్వేఛ్ఛానువాదం. ఆ సినిమా 1962 లో వచ్చిన ఒక హిందీ సినిమా.
ఆ సినిమా పేరు ఇవ్వాళ చాలా మంది మర్చిపోయింటారు,ఈ పాటను మరువలేరు,
మరువనివ్వని పాట ఇది.
హిందీ సినిమా పాటలు వినే అలవాటున్న వారికి సుపరితం.వినటం మానేసిన వారికీ మరుపురానిది..
చాలా కాలం తర్వాత సినిమాపాటను అనువదించాను,సరదాగా అనుకోండి

Friday, May 4, 2012

Aandhi (1975) నుంచి తేరేబినా జిందగీ సే కోయీ





నీవులేని జీవితంపై ఎలాంటి
నిట్టూర్పులూ లేవు నాకు
కానీ,నీవులేనిది జీవితమవుతుందా

నీ అడుగులలో మన మజిలీ
మొదలవ్వాలని కోరుకుందాం

సరికొత్త గమ్యాలను ఎన్నుకుంటూ సాగుదాం

ఎక్కడో ఒక చోట,దూర సుదూర తీరాలలో

నీవు నాతో నడుస్తూ ఉంటే

జాగాల కేం కొదవ

నీవులేని జీవితంపై ఎలాంటి
నిట్టూర్పులూ లేవు నాకు

కానీ,నీవులేనిది జీవితమవుతుందా


విలపిస్తూ....
నీ చీర చెరగులో శరణు పొందాలనే నా కోరిక

నీకన్నులలోని తడి కి అర్థం కన్నీరే కదా

కానీ,నీవులేనిది జీవితమవుతుందా

నీవు సరేనంటే
ఈ వెన్నెల వెళ్ళిపోదు
చెప్పు ఈరేయిని నిలిపివేయి
ఈరాత్రి సంగతి ఇది
జీవితంలో మరేమీ మిగలలేదు
నీవులేని జీవితంపై ఎలాంటి
నిట్టూర్పులూ లేవు నాకు
కానీ,నీవులేనిది జీవితమవుతుందా

Monday, April 30, 2012

Ijaazat-1987 నుంచి Mera Kuchh Samaan




Ijaazat ( 1987 )
ఇజాజత్
కొన్ని వస్తువులు నావి
నీ వశంలోనే ఉన్నాయి యింకా
రుతుపవనాలు తడిపిన కొద్ది దినాలు
ఉత్తరములో ఒదిగిన ఒక రాతిరి
వెలుపలకు వచ్చిన రాతిరి
నావి నాకు వాపసు చెయ్యి

కొన్ని వసంతాలు
ఆకులు రాలు చప్పుళ్ళు
నాచెవిలో నిలుపుకున్నాను
ఆ వసంతపు రెమ్మ  వణుకుతూనే ఉంది
ఆ రెమ్మను కిందకు దించు
నావి నాకు వాపసు చెయ్యి

ఒకసారి ఒకే గొడుగులో మనిద్దరం
సగం సగం తడిచి ముద్దయినప్పుడు
యిద్దరం సగం తడిచి,సగం పొడిగా
పొడిభాగం నాతోనే వచ్చింది
తడిచిన భాగం,బహుశా ఇంకా మంచం మీదే ఉంటుంది
పంపెయ్యి

నూటపదహారు వెన్నెల రాత్రులు
నీ భుజం పై ఒంటరి పుట్టుమచ్చ
ఇంకా తడిగా ఉన్న గోరింటాకు వాసన
కొన్ని కల్లబొల్లి ఫిర్యాదులు
మరికొన్ని శుష్క వాగ్దానాలు కూడా
అన్నీ నన్ను గుర్తు చెయ్యనీ
అన్నీ నాకు చేర్చు
నావి నాకు వాపసు చెయ్యి

చిట్టచివరగా నాకొక కడసారి కోరిక అనుగ్రహించు
ఈ స్మృతులన్నిటినీ మట్టిపాలు చేసినప్పుడు
నన్నూ అక్కడే పాతిపెట్టుకోనివ్వు నన్ను


Sunday, April 29, 2012

వెన్నెల్లో నడుస్తూ.....సత్యం శివం సుందరం మళయాళ సినిమా నుంచి ఒక మధుర గీతం


వెన్నెల్లో నడుస్తూ.....

 

గ గ గ ప రి స ని ధ స స రి
గ గ గ ధ ప రి స
స ని ధ స స రి
వెన్నెల్లో నడుస్తూ
నిన్నే  తలచుకుంటున్నా
వాన చినుకుల సవ్వడి వింటూ
నిన్నే  తలచుకుంటున్నా


నిన్నే  తలచుకుంటున్నా
హరిణేక్షణాల నుంచి
నిన్నే  తలచుకుంటున్నా
నిన్నే  తలచుకుంటున్నా
నీరులా స్పష్టమైన కలలలోంచి
నిన్నే  తలచుకుంటున్నా

హే సలోమా ఓ సలోమా ఓ సలోమా
ఓ సలోమా
దూరము నుండి చూసి ఎరగనట్టు ఊంటావు
చేరువకొస్తే ఉద్వేగంతో  ఉక్కిరిబిక్కిరి
పదునైన మాటలు చురుకైన చూపులు
నేను చూడనిదేదో నీవు చూసెయ్యాలని
మరుని శరాంతమున విరీ
నీ సిగ్గు ఇంధ్రధనసు రంగులమయం
నీయవ్వనరూపం నా గుండెల్లో
హే సలోమా సలోమా సలోమా
హే హే సలోమా సలోమా సలోమా
తీపిని అద్దుకున్న నీ కాలిమువ్వలు
నీలాలకురులతో రెక్కలు కట్టుకున్న కోరికలు
గొడుగల్లె విచ్చుకున్న గుండె
నీపలుకులే తేనెలసొనలు
పెదాలపైని దాహం
కౌగలించుకుంటేనే పర్వదిన సంగీతం
ఇదొక మధుర,సుందర స్వప్నం కాదా
హే సలోమా సలోమా సలోమా
హే హే సలోమా సలోమా సలోమా

 సత్యం శివం సుందరం మళయాళ సినిమా నుంచి ఒక మధుర గీతం

Wednesday, April 25, 2012

లవ్ స్టోరీ(1981) నుండి దేఖో మైనే దేఖాహై





చూడు,నేనొక కలగన్నాను
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?
వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి
ఈ స్వప్నం ఎంత బావుందో
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?

వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి
ఇక్కడ నీపేరూ నాపేరూ రాసి ఉన్నాయి
ఇక్కడే కాదు,ఈజగమంతా రాసే ఉంది
ఇదిగో... ఈ తలుపు దగ్గరే నీవుంటావు
లోనికొచ్చెయ్,చలిగా ఉంది
ఇక్కడ నుంచి ఆ కొండలనోసారి చూడు
ఎక్కడి నుంచి బాబూ,కిటికీ ఎక్కడా?

అది ఇక్కడే ఉంది,నీవెక్కడ?
వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి
ఈ స్వప్నం ఎంత బావుందో
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?

వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి

సరే నీళ్ళెక్కడున్నాయి?
పిచ్చిపిల్లా బయట ఏరొక్కటి పారుతుంది
కరంటేలేదు అంతా చీకటి
నీ కుంకుమ వెలుతురు కంటే ఏం తక్కువ?
అయ్యా నన్ను ఏడిపించక అలా బజారుదాకా వెళ్ళిరా
వెళ్తున్నా ,వెళ్తాలే ఒక్కసారి ఇటురా
సాయంత్రం సరదాగా ఉంది,ఎక్కడున్నావు నువ్వు?
వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి
చూడు,నేనొక కలగన్నాను
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?
వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి
అబ్బ ఈ వంటిల్లు ఎంత ముద్దుగా ఉందో?
మనిద్దరమేగా,మరెవరూ లేరుగా
ఇక్కడ ఊసులాడుకుంటాము
అక్కడ రాత్రుళ్ళు గడుపుతాము
అది సరే మనం గొడవ పడేదెక్కడా?
ఏమో నేను ఇంకా అది కట్టలేదు
ప్రేమ ఇక్కడుంది,నువ్వెక్కడున్నావు?


చూడు,నేనొక కలగన్నాను
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?
వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి



ఈ స్వప్నం ఎంత బావుందో
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?

వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి

బర్సాత్ కీ ఏక్ రాత్ నుండి టైటిల్ సాంగ్


ఎన్నటికీ మరువలేను ఆ వర్షం కురిసిన రాత్రిని
ఆ అందాన్ని కలిసిన ఆరాత్రిని
జీవితాంతం మరువలేను

1-
ఓ ఆమె తడిసిన కురుల నుంచి జారుతున్న నీటిబిందువులు
ఆ బిందువులు కూడా ఆమె గులాబీ చెక్కిళ్ళమీద పారాడాలనుకున్నాయి
ఆమె నాగుండెలో ఒక అలజడి రేపింది
జీవితాంతం మరువలేను
2.
ఉరుములు మెరుపులకు భయవిహ్వల అయ్యింది
సిగ్గులమొగ్గలా ముడుచుకుపోయింది
నేనెన్నడూ కనీవినీ ఎరుగను
నేనెన్నడూ కనీవినీ ఎరుగను అలాంటి మధురమైన రాత్రిని
జీవితాంతం మరువలేను

3.
తన ఎర్రటి శాలువాను ఆరేయబోయింది
అదేదో పదునైన బాణంతో నా గుండెను చీల్చినట్టుగా
ఆరాత్రే ఆమె నీటిలో నిప్పు రగిలించింది
జీవితాంతం మరువలేను


5.
నాగీతాలన్నిటా ఆమె రూపమే
నాకుర్రతనపు కోరికల ముగింపు ఆమె
దివి నుండి దిగివచ్చింది
రాత్రులకే రాత్రి దివి నుండి దిగివచ్చింది
ఎన్నటికీ మరువలేను ఆ వర్షం కురిసిన రాత్రిని
ఆ అందాన్ని కలిసిన ఆరాత్రిని
జీవితాంతం మరువలేను




వికీ డోనర్ నుండి పాణీ డ


నీటిని చూస్తే
కన్నీళ్ళు కాలువలవుతున్నాయి నాకు
నా ప్రియుడు ఇంకా రాలేదు
నా సఖుడు ఇంకా రాలేదు
కంటి మెరుపును చూసినా
కన్నీళ్ళు ఆగవు

నీవు లేక ఉన్మాదినవుతున్నా
దయతో నన్ను చేరవా
వర్ష ఋతువు మొదలయ్యింది
అయినా నీవు నాచెంత చేరలేదు
కంటి మెరుపును చూసినా
కన్నీళ్ళు ఆగవు  



యింటిపై కూర్చుని ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాము
ఎప్పటికి నన్ను వదలి వెళ్ళకు
నిన్ను ప్రేమించే,నీకై మరణించే
నాలాంటి నెచ్చెలి నీకు ఎవ్వరూ దొరకరు
అన్నీ వదిలి వచ్చెయ్యి ప్రియా
కన్నీళ్ళు ఆగవు