Wednesday, April 25, 2012

తెలుగైన పాట నా కొత్త బ్లాగుకి స్వాగతం.


తెలుగైన పాట నా కొత్త బ్లాగుకి స్వాగతం.
ప్రపంచమంతా గీతాలే,పాటలే,తెలుగునాట అయితే పద్యాలు కూడా కలుపుకోవచ్చు.
ప్రధానంగా పాటలు గీతాలంటే మనకు గుర్తుకొచ్చేది సినిమాపాటలు,ఆకాశవాణి వారు ప్రసారం చేసే లలితగీతాలు.మనం ఎక్కువ వినేదీ అవే అనటంలో సందేహం ఏమీలేదు కూడా.ఇవ్వాళ ఇంటర్ నెట్ సౌకర్యం చాలామందికి అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏమూల ఉన్నా ఎంతటి మారుమూల/ఎన్నాళ్టి క్రితం సంగీతం అయినా అత్యంతసునాయాసంగా వినగలిగే సౌలభ్యం ప్రాప్తించింది.ధ్వనులు ఆలకించి ఆనందించగలం గానీ సదరు గీతంలోని సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకోగలిగితే ఎంతబాగుండూ అనిపించని రోజు లేదు నావరకు నాకు గత పద్నాలుగేళ్ళుగా.అంటే నాకు ఇంటర్ నెట్ పరిచయమయిన నాటినుంచీ.
          సాహిత్యం అర్థం కాదు అన్న ఒక్కకారణం  చేత అందుబాటులో ఉన్న ఎన్నెన్నొ మంచి పాటలనూ మనం వినలేకపోతున్నామని నా ఒక్కడి అనుభవమే కాక కొందరు మిత్రులూ ఇదే భావం వెలిబుచ్చారు.ఈ మధ్య నేను సరదాగా మంచి హిందీపాటలు చెప్పండి తెలుగులోకి అనువదిస్తాను అన్నప్పుడు మంచి స్పందన వచ్చింది.కొన్నిపాటలను మిత్రులు సూచించారు మరికొన్ని నేనే ఎంపిక చేసుకున్నాను.మరికొందరైతే ఏకంగా కొన్ని సినిమాల్లోని అన్నిపాటలనూ తెలుగులోకి తెమ్మన్నారు.
ఇది వాణిజ్యపరంగానో మరొక లాభాపేక్షతోనో  చేస్తున్నది  కాదు కాబట్టీ,ఈ బ్లాగుద్వారా కాస్తో,కూస్తో ఆయాపాటలకూ ప్రచారం లభిస్తుంది కాబట్టీ ఇక్కడ కాపీరైటు వగైరాల సమస్యలు రావని నా భావన.
          దాదాపుగా అన్ని పాటల లిరిక్సును ఇంగ్లీషు అనువాదాల నుంచే తీసుకుంటున్నాను.కానీ ఏ ఒక్కరి అనువాదమో నిక్కచ్చిగా చెప్పలేని స్థితి.కొన్ని పాటలను ఇద్దరుముగ్గురు చేసిన అనువాదాల నుంచి తీసుకుంటున్నందువల్ల ఎవరికీ క్రెడిట్ ఇవ్వలేని స్థితి.
          ఇక్కడ లభ్యమయ్యే పాటలను అసలు మన స్వంత కవితలుగా చెలామణి  చేసుకోవచ్చు, అనిపించేంత గొప్ప సాహిత్యం ఉంది కొన్నిట్లో.భారతీయ భాషల్లోని గీతాలేకాక ప్రపంచ భాషల్లోని కొన్ని
మంచి పాటలను ఇలా ఈ బ్లాగురూపములో అందించాలని నాకోరిక.
అందుకే ఆదరించండి.
పైన ఫోటో :అనఘ
అనఘ వాళ్ల నాన్నగారి పేరు:భాస్కర్ రామరాజు
అనఘ వాళ్ళ అన్నయ్య పేరు:చూరి
అనఘ వాళ్ల నాన్న బ్లాగుల్లొ ఒకటి:నాన్న

No comments:

Post a Comment