Wednesday, April 25, 2012

చౌదవీకా చాంద్ హో...పున్నమి నాటి జాబిల్లివా,పూర్ణసూర్యబింబానివా



పున్నమి నాటి జాబిల్లివా,పూర్ణసూర్యబింబానివా
నీవెవరయినా గానీ
దేవుడి తోడు
నీకు సాటిలేదు
భుజాలను తాకుతున్న సుతిమెత్తని మేఘమాల నీకురులు
నీకనుదోయి మధుపాత్రలు రెండు
జీవనప్రణయానికై నీవే ఆమధిరను నింపుతున్నావు



నిర్మల తటాకం లాంటి నీ మోమున నీనవ్వే ఒక విలసిత కలువ
లేదా జీవితమనే తంత్రిమీటిన పదం
చెలీ నీవు కవికుల స్వప్నానివి

నీనవ్వు వెలిగిస్తుంది నీపెదాలను
నీరాకతో వేలమంది నేలకొరుగుతారు నీరాజనాలర్పిస్తూ
లోకంలోని అందాలకే నీవు మకుటానివి
పున్నమి నాటి జాబిల్లివా,పూర్ణసూర్యబింబానివా
నీవెవరయినా గానీ
దేవుడి తోడు
నీకు సాటిలేదు

No comments:

Post a Comment