Monday, April 30, 2012

Ijaazat-1987 నుంచి Mera Kuchh Samaan




Ijaazat ( 1987 )
ఇజాజత్
కొన్ని వస్తువులు నావి
నీ వశంలోనే ఉన్నాయి యింకా
రుతుపవనాలు తడిపిన కొద్ది దినాలు
ఉత్తరములో ఒదిగిన ఒక రాతిరి
వెలుపలకు వచ్చిన రాతిరి
నావి నాకు వాపసు చెయ్యి

కొన్ని వసంతాలు
ఆకులు రాలు చప్పుళ్ళు
నాచెవిలో నిలుపుకున్నాను
ఆ వసంతపు రెమ్మ  వణుకుతూనే ఉంది
ఆ రెమ్మను కిందకు దించు
నావి నాకు వాపసు చెయ్యి

ఒకసారి ఒకే గొడుగులో మనిద్దరం
సగం సగం తడిచి ముద్దయినప్పుడు
యిద్దరం సగం తడిచి,సగం పొడిగా
పొడిభాగం నాతోనే వచ్చింది
తడిచిన భాగం,బహుశా ఇంకా మంచం మీదే ఉంటుంది
పంపెయ్యి

నూటపదహారు వెన్నెల రాత్రులు
నీ భుజం పై ఒంటరి పుట్టుమచ్చ
ఇంకా తడిగా ఉన్న గోరింటాకు వాసన
కొన్ని కల్లబొల్లి ఫిర్యాదులు
మరికొన్ని శుష్క వాగ్దానాలు కూడా
అన్నీ నన్ను గుర్తు చెయ్యనీ
అన్నీ నాకు చేర్చు
నావి నాకు వాపసు చెయ్యి

చిట్టచివరగా నాకొక కడసారి కోరిక అనుగ్రహించు
ఈ స్మృతులన్నిటినీ మట్టిపాలు చేసినప్పుడు
నన్నూ అక్కడే పాతిపెట్టుకోనివ్వు నన్ను


1 comment:

  1. రాజేంద్ర గారు, నాకు హిందీ అంతంత మాత్రంగానే వస్తుంది, యేవో కొన్ని పదాలు అర్ధం అవుతాయి, కాబట్టి మొత్తం పాట తేటతెల్లంగా అర్ధం అయ్యే అవకాశం లేదు. నేను ఈ సినిమా చూసాను కాబట్టి, ఆ మొత్తం మీద కలిపి దాని అంతర్ధానం అర్ధం అయ్యింది అంతే .... :) మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ( పరాయి బాషలో ఉన్న పాటల తెనుగీకరణ ) హర్షించదగినది. నా బోటి వారికి తేటగా అర్ధం అవుతాయి, మాత్రుబాషె కాబట్టి ...! ఇంకా ఇలాంటి గొప్ప పాటలు ఎన్ని వందల సంఖ్యలో ఉంటాయో ....?

    ReplyDelete