Monday, April 30, 2012

Ijaazat-1987 నుంచి Mera Kuchh Samaan




Ijaazat ( 1987 )
ఇజాజత్
కొన్ని వస్తువులు నావి
నీ వశంలోనే ఉన్నాయి యింకా
రుతుపవనాలు తడిపిన కొద్ది దినాలు
ఉత్తరములో ఒదిగిన ఒక రాతిరి
వెలుపలకు వచ్చిన రాతిరి
నావి నాకు వాపసు చెయ్యి

కొన్ని వసంతాలు
ఆకులు రాలు చప్పుళ్ళు
నాచెవిలో నిలుపుకున్నాను
ఆ వసంతపు రెమ్మ  వణుకుతూనే ఉంది
ఆ రెమ్మను కిందకు దించు
నావి నాకు వాపసు చెయ్యి

ఒకసారి ఒకే గొడుగులో మనిద్దరం
సగం సగం తడిచి ముద్దయినప్పుడు
యిద్దరం సగం తడిచి,సగం పొడిగా
పొడిభాగం నాతోనే వచ్చింది
తడిచిన భాగం,బహుశా ఇంకా మంచం మీదే ఉంటుంది
పంపెయ్యి

నూటపదహారు వెన్నెల రాత్రులు
నీ భుజం పై ఒంటరి పుట్టుమచ్చ
ఇంకా తడిగా ఉన్న గోరింటాకు వాసన
కొన్ని కల్లబొల్లి ఫిర్యాదులు
మరికొన్ని శుష్క వాగ్దానాలు కూడా
అన్నీ నన్ను గుర్తు చెయ్యనీ
అన్నీ నాకు చేర్చు
నావి నాకు వాపసు చెయ్యి

చిట్టచివరగా నాకొక కడసారి కోరిక అనుగ్రహించు
ఈ స్మృతులన్నిటినీ మట్టిపాలు చేసినప్పుడు
నన్నూ అక్కడే పాతిపెట్టుకోనివ్వు నన్ను


Sunday, April 29, 2012

వెన్నెల్లో నడుస్తూ.....సత్యం శివం సుందరం మళయాళ సినిమా నుంచి ఒక మధుర గీతం


వెన్నెల్లో నడుస్తూ.....

 

గ గ గ ప రి స ని ధ స స రి
గ గ గ ధ ప రి స
స ని ధ స స రి
వెన్నెల్లో నడుస్తూ
నిన్నే  తలచుకుంటున్నా
వాన చినుకుల సవ్వడి వింటూ
నిన్నే  తలచుకుంటున్నా


నిన్నే  తలచుకుంటున్నా
హరిణేక్షణాల నుంచి
నిన్నే  తలచుకుంటున్నా
నిన్నే  తలచుకుంటున్నా
నీరులా స్పష్టమైన కలలలోంచి
నిన్నే  తలచుకుంటున్నా

హే సలోమా ఓ సలోమా ఓ సలోమా
ఓ సలోమా
దూరము నుండి చూసి ఎరగనట్టు ఊంటావు
చేరువకొస్తే ఉద్వేగంతో  ఉక్కిరిబిక్కిరి
పదునైన మాటలు చురుకైన చూపులు
నేను చూడనిదేదో నీవు చూసెయ్యాలని
మరుని శరాంతమున విరీ
నీ సిగ్గు ఇంధ్రధనసు రంగులమయం
నీయవ్వనరూపం నా గుండెల్లో
హే సలోమా సలోమా సలోమా
హే హే సలోమా సలోమా సలోమా
తీపిని అద్దుకున్న నీ కాలిమువ్వలు
నీలాలకురులతో రెక్కలు కట్టుకున్న కోరికలు
గొడుగల్లె విచ్చుకున్న గుండె
నీపలుకులే తేనెలసొనలు
పెదాలపైని దాహం
కౌగలించుకుంటేనే పర్వదిన సంగీతం
ఇదొక మధుర,సుందర స్వప్నం కాదా
హే సలోమా సలోమా సలోమా
హే హే సలోమా సలోమా సలోమా

 సత్యం శివం సుందరం మళయాళ సినిమా నుంచి ఒక మధుర గీతం

Wednesday, April 25, 2012

లవ్ స్టోరీ(1981) నుండి దేఖో మైనే దేఖాహై





చూడు,నేనొక కలగన్నాను
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?
వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి
ఈ స్వప్నం ఎంత బావుందో
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?

వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి
ఇక్కడ నీపేరూ నాపేరూ రాసి ఉన్నాయి
ఇక్కడే కాదు,ఈజగమంతా రాసే ఉంది
ఇదిగో... ఈ తలుపు దగ్గరే నీవుంటావు
లోనికొచ్చెయ్,చలిగా ఉంది
ఇక్కడ నుంచి ఆ కొండలనోసారి చూడు
ఎక్కడి నుంచి బాబూ,కిటికీ ఎక్కడా?

అది ఇక్కడే ఉంది,నీవెక్కడ?
వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి
ఈ స్వప్నం ఎంత బావుందో
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?

వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి

సరే నీళ్ళెక్కడున్నాయి?
పిచ్చిపిల్లా బయట ఏరొక్కటి పారుతుంది
కరంటేలేదు అంతా చీకటి
నీ కుంకుమ వెలుతురు కంటే ఏం తక్కువ?
అయ్యా నన్ను ఏడిపించక అలా బజారుదాకా వెళ్ళిరా
వెళ్తున్నా ,వెళ్తాలే ఒక్కసారి ఇటురా
సాయంత్రం సరదాగా ఉంది,ఎక్కడున్నావు నువ్వు?
వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి
చూడు,నేనొక కలగన్నాను
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?
వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి
అబ్బ ఈ వంటిల్లు ఎంత ముద్దుగా ఉందో?
మనిద్దరమేగా,మరెవరూ లేరుగా
ఇక్కడ ఊసులాడుకుంటాము
అక్కడ రాత్రుళ్ళు గడుపుతాము
అది సరే మనం గొడవ పడేదెక్కడా?
ఏమో నేను ఇంకా అది కట్టలేదు
ప్రేమ ఇక్కడుంది,నువ్వెక్కడున్నావు?


చూడు,నేనొక కలగన్నాను
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?
వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి



ఈ స్వప్నం ఎంత బావుందో
పుష్పనగరిలో మన యిల్లు
ఎంతబావుందో...ఎక్కడున్నావు నువ్వు?

వస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
వచ్చేయి

బర్సాత్ కీ ఏక్ రాత్ నుండి టైటిల్ సాంగ్


ఎన్నటికీ మరువలేను ఆ వర్షం కురిసిన రాత్రిని
ఆ అందాన్ని కలిసిన ఆరాత్రిని
జీవితాంతం మరువలేను

1-
ఓ ఆమె తడిసిన కురుల నుంచి జారుతున్న నీటిబిందువులు
ఆ బిందువులు కూడా ఆమె గులాబీ చెక్కిళ్ళమీద పారాడాలనుకున్నాయి
ఆమె నాగుండెలో ఒక అలజడి రేపింది
జీవితాంతం మరువలేను
2.
ఉరుములు మెరుపులకు భయవిహ్వల అయ్యింది
సిగ్గులమొగ్గలా ముడుచుకుపోయింది
నేనెన్నడూ కనీవినీ ఎరుగను
నేనెన్నడూ కనీవినీ ఎరుగను అలాంటి మధురమైన రాత్రిని
జీవితాంతం మరువలేను

3.
తన ఎర్రటి శాలువాను ఆరేయబోయింది
అదేదో పదునైన బాణంతో నా గుండెను చీల్చినట్టుగా
ఆరాత్రే ఆమె నీటిలో నిప్పు రగిలించింది
జీవితాంతం మరువలేను


5.
నాగీతాలన్నిటా ఆమె రూపమే
నాకుర్రతనపు కోరికల ముగింపు ఆమె
దివి నుండి దిగివచ్చింది
రాత్రులకే రాత్రి దివి నుండి దిగివచ్చింది
ఎన్నటికీ మరువలేను ఆ వర్షం కురిసిన రాత్రిని
ఆ అందాన్ని కలిసిన ఆరాత్రిని
జీవితాంతం మరువలేను




వికీ డోనర్ నుండి పాణీ డ


నీటిని చూస్తే
కన్నీళ్ళు కాలువలవుతున్నాయి నాకు
నా ప్రియుడు ఇంకా రాలేదు
నా సఖుడు ఇంకా రాలేదు
కంటి మెరుపును చూసినా
కన్నీళ్ళు ఆగవు

నీవు లేక ఉన్మాదినవుతున్నా
దయతో నన్ను చేరవా
వర్ష ఋతువు మొదలయ్యింది
అయినా నీవు నాచెంత చేరలేదు
కంటి మెరుపును చూసినా
కన్నీళ్ళు ఆగవు  



యింటిపై కూర్చుని ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాము
ఎప్పటికి నన్ను వదలి వెళ్ళకు
నిన్ను ప్రేమించే,నీకై మరణించే
నాలాంటి నెచ్చెలి నీకు ఎవ్వరూ దొరకరు
అన్నీ వదిలి వచ్చెయ్యి ప్రియా
కన్నీళ్ళు ఆగవు

వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై నుండి పీలూ



నీ నీలాల కన్నుల్లొ తేనియను నను తాగనీ
నీతడిపెదవులపై
తాగనీ నను ఇది నిషాల రుతువు 
నీతో వలపులో పడిపోయాను
నీతోనే ఈ వయోలా ఉన్నది
నీ చుట్టూ ఒక చిత్రమైన ప్రశాంతీ టెన్షనూ ఉన్నాయి
నీవు లేక జీవించినట్లే ఉండదు
నీవు లేక జీవించలేను
ఈవేళ నాకెందుకు మెలకువ వచ్చింది?
నీవు నా చేతుల్లో ఒరిగిపోయావు
నాలో కలిసిపోయావు
ఒక నదిలా నా యెదపై ఎక్కడో ఉన్న కడలిలోకి ప్రవహిస్తూ..
నను తాగనీ మౌనకదలికల సవ్వడిని
నను తాగనీ సవ్వడిలేని శ్వాసలను ఎన్నటికీ
తాగనీ నను ఇది నిషాల రుతువు
నీతో వలపులో పడిపోయాను
నీతోనే ఈ వయోలా ఉన్నది
నీ చుట్టూ ఒక చిత్రమైన ప్రశాంతీ టెన్షనూ ఉన్నాయి
నీవు లేక జీవించినట్లే ఉండదు
నీవు లేక జీవించలేను


నిన్ను సాయంసంధ్య వేళలో కలిస్తే
ఉదయం చిన్నబుచ్చుకుంటుంది
ప్రతి క్షణం.....ప్రతి క్షణం....ప్రతి సమయం నన్ను నీతలపులలో దహించివేస్తున్నాయి
నను తాగనీ ఈ దహించే వేదనని
నను తాగనీ ఈ అందాలహస్తాల నుంచి
నను తాగనీ ఇది నిషాల రుతువు
నీతో వలపులో పడిపోయాను నీతోనే ఈ వయోలా ఉన్నది
నీ చుట్టూ ఒక చిత్రమైన ప్రశాంతీ టెన్షనూ ఉన్నాయి
నీవు లేక జీవించినట్లే ఉండదు నీవు లేక జీవించలేను
నా ప్రపంచాలన్నీ నీకే అర్పించాను,.... నీకొరకు ప్రపంచాన్నే వదిలాను....నీకు నేను రుణపడి ఉన్నాను
అన్నీ వదిలేసాను
ఒక్కసారి విను నీకై నేను  నన్ను త్యాగం చేసుకున్నాను.

అందాజ్ నుండి జిందగీ ఏక్ సఫర్ హే సుహానా


బ్రతుకే ఒక చక్కని ప్రయాణం
రేపేమవుతుందొ ఎవరికి తెలుసు

తారాచంద్రుల్ని దాటి పోవాలి మనం
ఆకాశం అవతలికి చేరాలి మనం
ఈలోకాన్ని ఇక్కడే వదిలేద్దాం
రేపేమవుతుందొ ఎవరికి తెలుసు

##బ్రతుకే ఒక చక్కని ప్రయాణం
##రేపేమవుతుందొ ఎవరికి తెలుసు

జీవితాన్ని సుఖించు
లోకం గురించి నీవేడవకు
నవ్వుతూ రోజులు గడిపేయి
రేపేమవుతుందొ ఎవరికి తెలుసు


##బ్రతుకే ఒక చక్కని ప్రయాణం
##రేపేమవుతుందొ ఎవరికి తెలుసు
చావు ఎప్పటికైనా తప్పదు

ఆత్మ ఆనాడు వదిలిపోతుంది
అలాంటి వాటి గురించి ఎందుకు బెంగ
రేపేమవుతుందొ ఎవరికి తెలుసు

##బ్రతుకే ఒక చక్కని ప్రయాణం
##రేపేమవుతుందొ ఎవరికి తెలుసు



సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ నుండి తేరీమేరీ

 
నీ నా నా నీ ప్రేమ కథ కష్టం
రెండు ముక్కల్లో చెప్పలేము
ఒకమ్మాయి ఒకబ్బాయి ప్రేమ కథ కొత్తది
రెండు ముక్కల్లో చెప్పలేము
నీ నా నా నీ ప్రేమ కథ కష్టం
రెండు ముక్కల్లో చెప్పలేము
ఒకరికి ఒకరైనప్పుడే విడిపోయారు
నిన్ను వలచినప్పుడే లోకం నాదయ్యింది
నీనీడ కూడా యోజనాల దూరమవుతుందని
నేననుకోలేదు
దేవుడా అలాంటి కల యెందుకిచ్చావు?
నిజంగా చెరిగిపోయేందుకేనా?
//నీ నా నా నీ ప్రేమ కథ కష్టం
రెండు ముక్కల్లో చెప్పలేము


నీ కదలికలు నామాటలూ ఎవరికీ తెలియవులే
రెండు ముక్కల్లో చెప్పలేము
నా ప్రతి భావములోనూ నీవే
రెండు ముక్కల్లో చెప్పలేము

పగలూరేయీ గడిచిపోతున్నాయి మెలకువగానే
నీ తలపే తొలచివేస్తుంది నన్ను
విరహమంటోంది దూరాలు తొలగాలని
నీవూనేనూ చేరువవ్వాలనీ
నీ నా నా నీ ప్రేమ కథ కష్టం
రెండు ముక్కల్లో చెప్పలేము
ఒకమ్మాయి ఒకబ్బాయి ప్రేమ కథ కొత్తది
రెండు ముక్కల్లో చెప్పలేము
నీ నా నా నీ ప్రేమ కథ కష్టం
రెండు ముక్కల్లో చెప్పలేము

ఇది మా వింజమూరి అప్పారావుగారికి.సరదాగా రాసింది ముక్కస్య ముక్కాయా అన్నట్టు
మాటకు మాట అనువాదం అన్నమాట

http://www.youtube.com/watch?v=xoolY_56kTs

చౌదవీకా చాంద్ హో...పున్నమి నాటి జాబిల్లివా,పూర్ణసూర్యబింబానివా



పున్నమి నాటి జాబిల్లివా,పూర్ణసూర్యబింబానివా
నీవెవరయినా గానీ
దేవుడి తోడు
నీకు సాటిలేదు
భుజాలను తాకుతున్న సుతిమెత్తని మేఘమాల నీకురులు
నీకనుదోయి మధుపాత్రలు రెండు
జీవనప్రణయానికై నీవే ఆమధిరను నింపుతున్నావు



నిర్మల తటాకం లాంటి నీ మోమున నీనవ్వే ఒక విలసిత కలువ
లేదా జీవితమనే తంత్రిమీటిన పదం
చెలీ నీవు కవికుల స్వప్నానివి

నీనవ్వు వెలిగిస్తుంది నీపెదాలను
నీరాకతో వేలమంది నేలకొరుగుతారు నీరాజనాలర్పిస్తూ
లోకంలోని అందాలకే నీవు మకుటానివి
పున్నమి నాటి జాబిల్లివా,పూర్ణసూర్యబింబానివా
నీవెవరయినా గానీ
దేవుడి తోడు
నీకు సాటిలేదు

తెలుగైన పాట నా కొత్త బ్లాగుకి స్వాగతం.


తెలుగైన పాట నా కొత్త బ్లాగుకి స్వాగతం.
ప్రపంచమంతా గీతాలే,పాటలే,తెలుగునాట అయితే పద్యాలు కూడా కలుపుకోవచ్చు.
ప్రధానంగా పాటలు గీతాలంటే మనకు గుర్తుకొచ్చేది సినిమాపాటలు,ఆకాశవాణి వారు ప్రసారం చేసే లలితగీతాలు.మనం ఎక్కువ వినేదీ అవే అనటంలో సందేహం ఏమీలేదు కూడా.ఇవ్వాళ ఇంటర్ నెట్ సౌకర్యం చాలామందికి అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏమూల ఉన్నా ఎంతటి మారుమూల/ఎన్నాళ్టి క్రితం సంగీతం అయినా అత్యంతసునాయాసంగా వినగలిగే సౌలభ్యం ప్రాప్తించింది.ధ్వనులు ఆలకించి ఆనందించగలం గానీ సదరు గీతంలోని సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకోగలిగితే ఎంతబాగుండూ అనిపించని రోజు లేదు నావరకు నాకు గత పద్నాలుగేళ్ళుగా.అంటే నాకు ఇంటర్ నెట్ పరిచయమయిన నాటినుంచీ.
          సాహిత్యం అర్థం కాదు అన్న ఒక్కకారణం  చేత అందుబాటులో ఉన్న ఎన్నెన్నొ మంచి పాటలనూ మనం వినలేకపోతున్నామని నా ఒక్కడి అనుభవమే కాక కొందరు మిత్రులూ ఇదే భావం వెలిబుచ్చారు.ఈ మధ్య నేను సరదాగా మంచి హిందీపాటలు చెప్పండి తెలుగులోకి అనువదిస్తాను అన్నప్పుడు మంచి స్పందన వచ్చింది.కొన్నిపాటలను మిత్రులు సూచించారు మరికొన్ని నేనే ఎంపిక చేసుకున్నాను.మరికొందరైతే ఏకంగా కొన్ని సినిమాల్లోని అన్నిపాటలనూ తెలుగులోకి తెమ్మన్నారు.
ఇది వాణిజ్యపరంగానో మరొక లాభాపేక్షతోనో  చేస్తున్నది  కాదు కాబట్టీ,ఈ బ్లాగుద్వారా కాస్తో,కూస్తో ఆయాపాటలకూ ప్రచారం లభిస్తుంది కాబట్టీ ఇక్కడ కాపీరైటు వగైరాల సమస్యలు రావని నా భావన.
          దాదాపుగా అన్ని పాటల లిరిక్సును ఇంగ్లీషు అనువాదాల నుంచే తీసుకుంటున్నాను.కానీ ఏ ఒక్కరి అనువాదమో నిక్కచ్చిగా చెప్పలేని స్థితి.కొన్ని పాటలను ఇద్దరుముగ్గురు చేసిన అనువాదాల నుంచి తీసుకుంటున్నందువల్ల ఎవరికీ క్రెడిట్ ఇవ్వలేని స్థితి.
          ఇక్కడ లభ్యమయ్యే పాటలను అసలు మన స్వంత కవితలుగా చెలామణి  చేసుకోవచ్చు, అనిపించేంత గొప్ప సాహిత్యం ఉంది కొన్నిట్లో.భారతీయ భాషల్లోని గీతాలేకాక ప్రపంచ భాషల్లోని కొన్ని
మంచి పాటలను ఇలా ఈ బ్లాగురూపములో అందించాలని నాకోరిక.
అందుకే ఆదరించండి.
పైన ఫోటో :అనఘ
అనఘ వాళ్ల నాన్నగారి పేరు:భాస్కర్ రామరాజు
అనఘ వాళ్ళ అన్నయ్య పేరు:చూరి
అనఘ వాళ్ల నాన్న బ్లాగుల్లొ ఒకటి:నాన్న